- Advertisement -
హైదరాబాద్ : శివమాలాధారణ భక్తులు నల్లమల అడవిలో నడుచుకుంటూ శ్రీశైలం దేవాలయానికి వెళ్లటానికి అనుమతి లేదని ఆటవీ శాఖ తెలిపింది. ఈ మేరకు లింగాల అటవీశాఖ అధికారులు తెలిపారు. లింగాల నుంచి గిరిజన గుండాల మార్గంలోని కృష్ణా నది వరకు.. నల్లమలలో చిరుతలు, పులుల సంచారం అధికంగా ఉందన్నారు.. పాదయాత్ర చేయటానికి వీలులేని పరిస్థితులు ఉన్నాయన్నారు. అడవిలో జనసంచారంతో వన్యమృగాలు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు.
నల్లమలలో ఎతైన కొండలున్నందున శ్రీశైలం వెళ్లే భక్తులకు సెల్ ఫోన్లకు సిగ్నళ్లు ఉండవని, సరైన మార్గం లేదన్నారు. ‘అడవిలో గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకోడానికి వీలులేని పరిస్థితు‘లున్నాయన్నారు. మన్ననూరు. అచ్చంపేట నుంచి. వటవర్లపల్లి మార్గంలో భక్తులు శ్రీశైలానికి పాదయాత్ర చేయటానికి అనుమతి ఉందన్నారు.
- Advertisement -