Saturday, November 23, 2024

అదానీ కోసం ప్రధాని.. ప్రధాని సేవలో గవర్నర్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ బిలియనీర్ అదానీ కోసం పనిచేస్తారు. ఇక గవర్నర్లు మోడీ బాగుకోసం పాటుపడుతారు. ఇదీ ఇప్పటి వ్యవస్థ తమాషా అని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఆదివారం ఏకంగా 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించడంపై కాంగ్రెస్ స్పందించింది. ప్రధాని మోడీ కోసం పనిచేసే వారికి గవర్నరు పదవులు దక్కుతాయి. ఇక మోడీ కోసం బాగా పనిచేయాల్సి ఉన్నప్పుడు మోడీకి కావల్సిన వారు గవర్నర్లు అవుతారని కాంగ్రెస్ ఎంపి మాణిక్కం ఠాగూర్ వ్యాఖ్యానించారు. ఇక ఈ వలయంలో ప్రధాన బిందువు అయిన అదానీ కోసం ప్రధాని నిరంతర పనికిదిగుతారని ఎంపి చెప్పారు. జరుగుతున్న తతంగంతో ఇక అంతా పెద్ద ఎత్తుననే భారత్ మాతాకీ జై అని నినదించవచ్చునని చమత్కరించారు.

ఈ దశలోనే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఓ వీడియోతో కూడిన ట్వీటు వెలువరించారు. కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ గవర్నర్ల నియామకంపై 2012లో చెప్పిన మాటలు ఈ వీడియోలో ఉన్నాయి. పదవీ విరమణకు ముందు వెలువరించే తీర్పులు తరువాతి పదవులకు దారితీస్తాయని జైట్లీ చెప్పిన విషయాన్ని రిటైర్డ్ జడ్జి అబ్దుల్ నజీర్ గవర్నర్ అయిన నేపథ్యంలో రమేష్ ప్రస్తావించారు. జైట్లీ వ్యాఖ్యలకు గత మూడు నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్న తంతు ప్రత్యక్ష ఉదాహరణగా ఉందన్నారు. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలను బిజెపి ఖండించింది. కాంగ్రెస్ దృష్టిలో మహా పాపం అని బిజెపి ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News