Monday, December 23, 2024

భార్యపై అనుమానంతో పిల్లలను చంపి…

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: భార్యపై అనుమానంతో ఇద్దరు పిల్లలని హత్య చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం రాయచూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దేవదుర్గలో నింగప్ప(35), ప్రభావతి(30) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు రాఘవేంద్ర(05), శివరాజ్(03) అనే పిల్లలు ఉన్నారు. ప్రభావతికి వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆమెతో పలుమార్లు భర్త గొడవకుదిగాడు. ఇద్దరు మధ్య కొన్ని రోజుల గొడవలు జరుగుతున్నాయి. అక్రమ సంబంధంతోనే పిల్లలు పుట్టారని అనుమానం రావడంతో ఇద్దరు పిల్లలను బైక్ తీసుకొని జక్లేర్ దొడ్డి శివారులోకి నింగప్ప వెళ్లాడు. ఇద్దరు పిల్లలను గొంతు నులిమి హత్య చేశాడు. స్థానికుల సమాచారం మేరకు కుటుంబ సభ్యులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని డిఎస్‌పి సత్యనారాయణ తెలిపాడు. నింగప్పను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News