- Advertisement -
ఈ ఇద్దరు న్యాయమూర్తుల నియామకంతో సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 34కు పెరిగింది!
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి కొత్తగా ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో సుప్రీంకోర్టుకు కేటాయించిన మొత్తం 34 జడ్జీల సంఖ్య నిండింది. న్యాయమూర్తులు రాజేశ్ బిందాల్, అరవింద్ కుమార్ కొత్తగా సుప్రీంకోర్టు ప్రాంగణంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ ఇద్దరి నియామకంతో సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 34కు చేరింది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతికి ముందు న్యాయమూర్తి బిందాల్ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, న్యాయమూర్తి అరవింద్ కుమార్ గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. సుప్రీంకోర్టు కొలిజియం జనవరి 31న వారికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతిని సిఫార్సు చేసింది.
- Advertisement -