డామస్కస్: ఆశలు అడుగంటినా సిరియా, టర్కీలో భూకంప బాధితులను శిథిలాల నుంచి కాపాడే ప్రయత్నం ఇంకా కొనసాగుతోంది. భూకంపంలో వేలాది మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో ఓ వీడియో క్లిప్ అందరి హృదయాలను కలిచివేస్తోంది. సిరియాలోని ఉత్తర అలెప్పోలోని అఫ్రిన్ నగరంలో శిథిలాల క్రింద తన ప్రాణాలు వదులుతూ కూడా ఓ చిన్నారి తన చెల్లిని కాపాడింది. దానికి సంబంధించి వీడియో ఇప్పుడు నెట్టింట ప్రచారంలో ఉంది. ఆ వీడియో క్లిప్‌లో తన చెల్లిని కాపాడుతున్న ప్రాణాలు వదిలేసిన అక్క చేయి హత్తుకుని ఉండడం కనిపిస్తోంది.
ఇప్పటికే ఎనిమిది రోజులు గడిచిపోయాయి. అయినా శిథిలాల క్రింద ఇంకా ఎంత మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారో తెలియడం లేదు. ప్రాణాలతో ఉన్నవారిని కాపాడే ఆశలు కూడా అడుగంటున్నాయి. రోజులు గడిచిపోతున్నాయి. ఆదివారం నాటికి దాదాపు 35000 మంది భూకంపం కారణంగా చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ భూకంపం దాదాపు 50 లక్షల మందిని ప్రభావితం చేసింది. ఐక్యరాజ్యసమితి మానవ వ్యవహారాల డిప్యూటీ సెక్రటరీ జనరల్ మార్టిన్ గ్రిఫిత్స్ రెండు దేశాల్లో భూకంప మృతుల సంఖ్య 40000 దాటొచ్చన్న ఆందోళనను వ్యక్తం చేశారు.
Her baby sister sacrificed herself… Incredible moments to save a baby alive who was in the lap of her sister.
The city of Jandiris in the countryside of Afrin, north of #Aleppo, at dawn on Monday, Feb 6, after the violent #earthquake that hit northwestern regions of #Syria. pic.twitter.com/awLgP6Jlsp— The White Helmets (@SyriaCivilDef) February 11, 2023