Friday, May 16, 2025

రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోరీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి పట్టణ శివారులోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు హుండీలో నగదు చోరీ చేశారు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆలయ హుండీలోని నగదు ఎత్తుకెళ్లారు. భువనగిరి పట్టణ శివారులోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేస్తున్న దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.

హుండీలో సుమారు 40వేల నగదు ఉండొచ్చని పోలీసులు, పూజరులు భావిస్తున్నారు. సీసీ కెమెరాల్లోని దృశ్యాలు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ చోరీని ఎవరు చేశారు.. స్థానికులా?.. లేక బయటి వ్యక్తులా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఆలయంలో గతంలోనూ చోరీ జరిగినట్లు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసకోవాలని భక్తులు కోరుతున్నారు.

Video Player
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News