Saturday, November 23, 2024

దుబ్బాకకు నిధులు ఇవ్వడం లేదని హైకోర్టులో పిటిషన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వడం లేదన్న ఎంఎల్‌ఎ రఘునందన్ రావు పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బిజెపి నుంచి తాను ఎంఎల్‌ఎగా గెలిచినప్పటి నుంచి దుబ్బాక నియోజకవర్గానికి స్పెషల్ డవలప్‌మెంట్ ఫండ్(ఎస్‌డిఎఫ్) నిధులు మంజూరు చేయడం లేదని రఘునందన్ రావు పిటిషన్‌లో పేర్కొన్నారు.బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకే నిధులు ఇస్తున్నారని..

విపక్ష శాసనసభ్యులున్న చోట వివక్ష చూపుతున్నారని రఘునందన్ తరపున న్యాయవాది రచనారెడ్డి వాదించారు. గజ్వేల్, సిద్ధిపేట వంటి నియోజకవర్గాలకు నిధులు ఇస్తూ.. అదే జిల్లాలోని దుబ్బాకకు మూడేళ్లుగా నిధులు ఇవ్వడం లేదన్నారు. రఘునందన్ పిటిషన్‌పై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని సిఎస్, జిఎడి, ఆర్థిక, ప్రణాళిక శాఖల ముఖ్య కార్యదర్శులు, సిద్ధిపేట, మెదక్ కలెక్టర్లు, మెదక్ ముఖ్య ప్రణాళిక అధికారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News