Saturday, December 21, 2024

9జిల్లాల్లో కోడ్

- Advertisement -
- Advertisement -

మన ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఓటర్ల నమోదు ప్రక్రియ సోమవారంతో పూర్తయిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పేర్కొన్నారు. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ టీచర్ ఎంఎల్‌సి నియోజకవర్గం ఓటర్ల నమోదు పూర్తయిందని తెలిపారు. 2022, డిసెంబర్ 31వ తేదీ నాటికి 3 జిల్లాల్లో టీచర్ ఎంఎల్‌సి ఓటర్ల సంఖ్య 29,501గా తేలిందని, కాగా, కొత్తగా 1,131 ఓటు హక్కు దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఆ దరఖాస్తులను పరిశీలించి ఈ నెల 23 న తుది జాబితా ప్రకటిస్తామని అన్నారు. గతంలో తిరస్కరించిన 1,440 దరఖాస్తుల్లో 788 సరైనవే అని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతామని పేర్కొన్నారు.

రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి ఇసి నిర్దేశించిన మార్గదర్శకాల మే రకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఎంఎల్‌సి ఎన్నికల షె డ్యూల్‌తో తొమ్మిది జిల్లాలు (హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వ నపర్తి, జోగులాంబ గద్వాల్)లో జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని అన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు ఎన్నికల నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు. ఎంఎల్‌సి ఎన్నికలకు నోటా, వ్యయ పరిమితి నిబంధన లేదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికకు సంబంధించి ఈ నెల 16వ తేదీ నోటఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 23వ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం కల్పించారు. మార్చి 13న ఎన్నికల ఉదయం 8 గంటల నుం చి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News