ముంబై: స్టాక్ మార్కెట్‌లో నేడు(మంగళవారం) రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. మళ్లీ పుంజుకున్నాయి. ప్రారంభం నుంచే లాభాలతో పుంజుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానకూల సంకేతాలు మార్కెట్‌కు ఊతమయ్యాయి. మరోవైపు గత నెల టోకు ద్రవ్యోల్బణం జనవరి 2021 నాటి స్థాయికి తగ్గడంతో సెంటిమెంటు బలపడింది. హెవీ వెయిట్లయిన ఆర్‌ఐఎల్, ఐటిసి, బ్యాంకింగ్, ఐటి షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు తగ్గడం, విదేశీ మదుపరులు కొనుగోళ్లకు దిగడంతో సెంటిమెంట్ బలపడింది.
సెన్సెక్స్ 600.42 పాయింట్లు లేక 0.99 శాతం పెరిగి 61032.26 వద్ద, నిఫ్టీ 158.95 పాయింట్లు లేక 0.89 శాతం పెరిగి 17929.85 వద్ద ముగిసాయి. నిఫ్టీలో టాప్‌గెయినర్స్ యుపిఎల్, ఐటిసి, ఆర్‌ఐఎల్, అదానీ పోర్ట్ సెజ్ కాగా, టాప్‌లూజర్స్‌గా ఐషెర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్, ఎస్‌బిఐ లైఫ్, బిపిసిఎల్ ఉన్నాయి. పది గ్రాముల మేలిమి బంగారం రూ. 241.00 లేక 0.43 శాతం పెరిగి 56738.00 వద్ద ట్రేడవ్వగా, అమెరికా డాలరుకు రూపాయి మారకం విలువ రూ. 82.73(ప్రావిజినల్) వద్ద ఉంది.
స్పైస్‌జెట్ షేరు నేడు ఇంట్రాడేలో దాదాపు 5 శాతం మేరకు నష్టపోయింది. కళానిధి మారన్‌కు రూ. 270 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు స్పైస్‌జెట్‌ను ఆదేశించడంతో ఆ కంపెనీ షేరు విలువ నష్టపోయింది. మార్కెట్ ముగిసే సమయానికి 4.85 శాతం నష్టపోయి రూ. 33.35 వద్ద ముగిసింది.
ఆసియా మార్కెట్‌లో షాంఘై, టోక్యో, సియో స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లు లాభపడ్డాయి. కాగా హాంకాంగ్ కాస్త కింది స్థాయిలో ముగిసింది. ఇక యూరొప్ బ్రౌజర్లు లాభాల్లోనే ట్రేడవుతున్నాయి.