దేశపు మొట్టమొదటి, టాటా గ్రూప్‌కు చెందిన, ఎక్కువ మంది అభిమానించే ఓమ్నీ ఛానెల్ ఎలకా్ట్రనిక్స్ రిటైలర్ క్రోమా, తెలంగాణాలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తూ తెలంగాణాలో రెండవ అతిపెద్ద నగరం వరంగల్‌లో తమ మొదటి స్టోర్‌ను ఏర్పాటుచేసింది. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలకు విఖ్యాతి గాంచిన ప్రాంతంగా మాత్రమే గాక పర్యాటక ఆకర్షణల పరంగా కూడా సుప్రసిద్ధ నగరం వరంగల్. ఈ నగరం తమ మొట్టమొదటి క్రోమా ఎలకా్ట్రనిక్స్‌ను సాదరంగా ఎస్‌వీ పటేల్ రోడ్, రంగంపేట, వరంగల్ వద్ద స్వాగతించింది.
దాదాపు 550 కు పైగా బ్రాండ్ల వ్యాప్తంగా 16వేలకు పైగా ఉత్పత్తులను వరంగల్ స్టోర్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్టోర్ 15–2–261, ఎస్‌వీ పటేల్ రోడ్, రంగంపేట, కాకతీయ మెడికల్ కాలేజీ ఎదురుగా, వరంగల్ వద్ద ఉంది. వేగవంతమైన నగరీకరణతో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటిగా నిలిచిన నగరం వరంగల్. ఇక్కడ ప్రధానంగా ఆర్ధిక వ్యవస్థ , వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా ఈ నగరంలో ఆసియాలో రెండవ అతి పెద్ద ధాన్యపు మార్కెట్ ఉంది. ఇది ఎనుమాముల వద్ద ఉంది. ఈ నగరంలో మహోన్నత సాంస్కృతిక వారసత్వం కూడా ఉంది.. ప్రతి సంవత్సరం అశేష సంఖ్యలో పర్యాటకులను ఈ నగరం ఆకర్షిస్తుంది. భారతదేశంలో అతి ప్రధానమైన పర్యాటక కేంద్రం ఇది. ఈ అంశాలన్నీ కూడా ఈ ప్రాంతాన్ని ఎలకా్ట్రనిక్స్ పరంగా అత్యుత్తమతను కోరుకునే వినియోగదారుల కోసం ప్రాముఖ్యత కేంద్రంగా మలిచాయి.
వరంగల్‌లో దాదాపు 11వేల చదరపు అడుగులు విస్తీర్ణంలో ఉన్న ఈ స్టోర్ మూడు అంతస్తులలో ఉంది. ఇక్కడ వినియోగదారులు అత్యున్నత అనుభవం, నైపుణ్యం కలిగిన క్రోమా ఎక్స్‌పర్ట్స్ నుంచి కొనుగోలు సమయంలో అవసరమైన సహాయాన్ని పొందగలరు. ఈ స్టోర్‌లో వినియోగదారులు తాజా శ్రేణి ఉత్పత్తులను అన్వేషించవచ్చు. వీటిలో టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, డిజిటల్ ఉపకరణాలు, కూలింగ్ సొల్యూషన్స్, గృహోపకరణాలతో పాటుగా ఆడియో, సంబంధిత యాక్ససరీలు ఉంటాయి. క్రోమా యొక్క కొనుగోలు అనంతర సేవలను సైతం వీరు పొందడంతో పాటుగా నైపుణ్యంతో కూడిన సలహాలను సైతం పొందవచ్చు .
క్రోమా ఇన్ఫినిటీ–రిటైల్ లిమిటెడ్, ఎండీ–సీఈఓ అవిజిత్ మిత్రా మాట్లాడుతూ ‘‘ మా నూతన స్టోర్‌ను వరంగల్‌లో ప్రారంభించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. మా రిటైల్ కార్యకలాపాలు విస్తరిస్తుండటం చేత, మేము మరింతగా మా వినియోగదారులకు చేరువవుతున్నాము. మా తాజా శ్రేణి అత్యాధునిక, వినూత్నమైన ఉత్పత్తుల, ఆఫర్లను ప్రదర్శిస్తున్నాము. ఇవి విశ్వసనీయ అనుభవాలను వినియోగదారులకు అందించడంతో పాటుగా అత్యుత్తమ శ్రేణి షాపింగ్ అనుభవాలను సైతం వినియోగదారులకు అందించనున్నాయి’’ అని అన్నారు. వరంగల్‌లో క్రోమా స్టోర్ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఏడు రోజులూ తెరిచి ఉంటుంది.