Saturday, November 23, 2024

మద్యం తాగి అసభ్యంగా ప్రవర్తించిన వరుడు… పెళ్లి రద్దు చేసిన వధువు

- Advertisement -
- Advertisement -

చెన్నై: వరుడు మద్యం తాగి వధువు అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె పెళ్లి రద్దు చేసుకున్న సంఘటన తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలో జరిగింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం… కాంచీ పురం ప్రాంతానికి చెందిన లక్ష్మీ నరసింహాన్‌కు తెయ్యూరుకు చెందిన యువతి పెళ్లి నిశ్చయమైంది. సోమవారం యువతి, యువకుడికి పెళ్లి జరగాల్సి ఉండడంతో ముందు రోజు కల్యాణ మండపంలో విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ఇరు కుటుంబాల సభ్యులు, బంధువులు పాల్గొన్నారు. వరుడు మద్యం తాగి వధువుతో అసభ్యంగా ప్రవర్తించాడు. వరుడు తనకు వద్దని వధువు తెగేసి చెప్పింది. వింధును మధ్యలో ఆపేసి వధువు తరుపు బంధువులు వెళ్లిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News