Sunday, November 24, 2024

నెలసరి రుతుక్రమ సెలవుపై ఈనెల 24న సుప్రీంలో విచారణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : విద్యార్థినులు, పనిచేసే మహిళలకు సంబంధించి నెలసరి రుతుక్రమ శెలవు నిబంధనల అమలుపై దాఖలైన పిటిషన్‌ను వచ్చేవారం విచారించడానికి సుప్రీం కోర్టు బుధవారం అంగీకరించింది. అన్ని రాష్ట్రాలు ఈమేరకు చట్టప్రకారం నిబంధనలు పాటించేలా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వం లోని ధర్మాసనం ముందుకు బుధవారం రాగా, ఈ నెల 24 న విచారణ చేపట్టడానికి సుప్రీం అంగీకరించింది.

ఢిల్లీకి చెందిన శైలేంద్ర మణి త్రిపాఠీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రసూతి ప్రయోజన చట్టం 1961 లోని సెక్షన్ 14 ప్రకారం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తప్పనిసరిగా నిబంధనలు అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ నిబంధనలు సరిగ్గా అమలవుతున్నాయా లేదా అని పరిశీలించడానికి సెక్షన్ 14 ప్రకారం ఇన్‌స్పెక్టర్లను ప్రభుత్వాలు నియమించుకునే అవకాశం ఉంటుందని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News