Friday, December 20, 2024

పట్టాలు తప్పిన గోదావరి

- Advertisement -
- Advertisement -

ఘట్‌కేసర్: ఘట్‌కేసర్ మండలం అంకుషాపూర్ 219/31మైలు రాయి వద్ద విశాఖ పట్నం నుండి సికింద్రాబాద్ వైపు వెలుతున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ (12727) రైలు పట్టులు తప్పినప్పటికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పిల్తుకున్నారు. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు ఎస్ 1 నుండి ఎస్ 4 బోగిలతో పాటు మరో 2 జనరల్ బోగిలు పట్టాలు తప్పగా భారీ శబ్దంతో ప్రయాణికులు ఒక్క సారిగా ఉలికిపడ్డారు. బోగిలు దాదాపు 400 మీటర్ల మేర దూసుక పోవడంతో పట్టాల ద్వంసమైనాయి.

సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు పట్టాలు తప్పిన 6 బోగిలను విడదీసి ప్రయాణికులతో కూడిన మిగత బోగిలతో రైలును సికింద్రాబాద్ పంపించారు. దీనితో నిత్యం వందలాది రైళ్ళు రాకపోకలు సాగించే ప్రధాన రైలు మార్గం కావడంతో రైల్వే అధికారులు రైళ్ళ రాకపోకలను నిలిపివేశారు. ప్రధాన రైళ్ళను ఇరత మార్గాల ద్వారా మల్లించారు. పట్టాలు తప్పిన బోగిలలోని ప్రయాణికులు ఆంధోళనతో స్థానికుల సహాయంతో రోడ్డు మార్గం ద్వారా గమ్య స్థానాలకు చేరుకున్నారు. రైల్వే సిబ్బంది బోగిలను పట్టాలు ఎక్కించి రైళ్ళను పునరుద్దరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News