Saturday, December 21, 2024

కెసిఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తాం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌లో అన్ని డివిజన్ల వారిగా నిర్వహిస్తున్నామని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 17న కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా అన్ని మతాలు, అన్ని వర్గాలు, దేవాలయాలు, చర్చ్ లు, మసీద్‌లలో ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహిస్తున్నామన్నారు. పెద్దమ్మ దేవాలయంలో మేయర్, సికింద్రాబాద్ గణేష్ దేవాలయంలో డిప్యూటీ మేయర్ ప్రత్యేక పూజలు చేస్తారన్నారు. అలాగే చండీయాగం, ఆయుష్ హోమం, బల్కంపేట ఆలయంలో రాజశ్యామల యాగం వంటి కార్యక్రమాలను తలపెట్టామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News