- Advertisement -
ఔరంగాబాద్: బొంబై హైకోర్టుకు చెందిన ఔరంగాబాద్ బెంచ్ ఆవరణలో బాంబు ఉందని బెదిరింపు రావడంతో పోలీస్‌లు గాలించి చివరకు అది ఉత్తదేనని తెలుసుకున్నారు. ఔరంగాబాద్ బెంచ్ ఆవరణలో బాంబు ఉందని ఇక్కడి మహారాష్ట్ర పోలీస్ కంట్రోల్ రూమ్‌కు మంగళవారం సాయంత్రం 5.45 గంటలకు బీహార్ నుంచి బెదిరింపు కాల్ వచ్చింది.
తాను డబ్బు చెల్లించినా పని కాలేదని, అందుకే హైకోర్టులో బాంబు పెట్టానని అవతలి వ్యక్తి బెదిరించినట్టు అధికారులు తెలిపారు. పుండలిక్ నగర్ పోలీస్ స్టేషన్, బాంబు డిటెక్షన్ , డిస్పోజల్ స్కాడ్ అక్కడికి వెంటనే వెళ్లి భవనం రెండు అంతస్తులను తనిఖీ చేయగా ఉత్తదే అని తేలింది. దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.
- Advertisement -