Monday, December 23, 2024

‘కాంతార’ హీరోకు మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డు..

- Advertisement -
- Advertisement -

బ్లాక్‌బస్టర్ మూవీ ‘కాంతార’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్న హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి. ఈ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తుండగానే రిషబ్ శెట్టి ఓ పురస్కారాన్ని గెలుపొందారు.

రిషబ్ తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డును గెలుచుకున్నారు. ‘కాంతార’లోని నటనకు గాను ఈ పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం రిషబ్ శెట్టి ‘కాంతార 2’ పై పనిచేస్తున్నారు. ‘కాంతార 2’ అనేది సీక్వెల్ కాదని ప్రీక్వెల్ అని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News