Saturday, April 12, 2025

కొండపోచమ్మ సాగర్‌ను సందర్శించిన పంజాబ్ సిఎం

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పర్యటిస్తున్నారు. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌ను సిఎం భగవంత్ మాన్ సందర్శించారు. ఎర్రవెల్లి చెడ్ డ్యామ్ వద్దకు చేరుకొని డ్యామ్‌ను భగవంత్ మాన్ పరిశీలిస్తున్నారు. భగవంత్ మాన్ వెంటన అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.

తెలంగాణతో పాటు పంజాబ్ లో అన్ని రాకాల వనరులున్నాయని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ తెలిపారు. నూతన సాంకేతికత ఎక్కడున్నా దానిని అందిపుచ్చుకోవాలని, ప్రజలకు అందించడమే పాలకుల విధి అని చెప్పారు. నీటి పారుదలలో తెలంగాణ మోడల్ గా ఉందన్నారు. దీనిని పంజాబ్ లో కూడా అమలు చేస్తామని భగవంత్ మాన్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News