- Advertisement -
సురేంద్ర నగర్ : బీజేపీ ఎమ్‌ఎల్‌ఎ హార్ధిక్ పటేల్‌కు గుజరాత్ లోని సురేంద్ర నగర్ జిల్లా కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2017 నాటి కేసులో కోర్టు ముందు హాజరు కావడం లేదని జిల్లా కోర్టు హార్ధిక్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆదేశాలను ఆయన అతిక్రమించినట్టు కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ ఓ గ్రామంలో పటేల్ రాజకీయ ప్రసంగం చేశారు. ఆ కేసులో జిల్లా అదనపు చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ డీడీ షా అరెస్టు వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ధరగంద్ర తాలూకా పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. పటేల్‌ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పర్చాలని, మెజిస్ట్రేట్ అక్కడి పోలీసులను ఆదేశించారు. ఫిబ్రవరి 11 వ తేదీ ఆ పోలీస్ స్టేషన్‌కు ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది.
- Advertisement -