అగర్తల: సెల్ఫీల కోసం జరిగిన స్వల్ప వాగ్వాదం చిలికి చిలికి గాలివానగా మారి క్రికెటర్ పృథ్వీ షాపై బేస్‌బాల్ బ్యాట్‌తో దాడికి దారితీసింది. పృథ్వీతోపాటు అతని స్నేహితుడిపై దాడి చేసి, వారి కారు అద్దాలను ధ్వంసం చేయడంతోపాటు రూ. 50 వేలు డిమాండ్ చేశారన్న ఆరోపణపై 8 మంది వ్యక్తులతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా..తమపై వచ్చిన ఆరోపణలను నిందితులు శోభిత్ ఠాకూర్, సనా లేదా సప్నా గిల్ ఖండించారు. నిజానికి తమపై ముందుగా దాడి చేసింది పృథ్వీషాయేనని వారు ఆరోపించారు.
ముంబై విమానాశ్రయం సమీపంలోని ఒక ఫ్యాన్సీ హోటల్ వద్ద బుధవారం తెల్లవారుజామున తమపై దాడి జరిగినట్లు షా స్నేహితుడు ఆరోపించారు. అభిమానుల మంటూ సెల్ఫీల కోసం ఒక యువకుడు, ఒక మహిళ పృథ్వీ వద్దకు వచ్చారని అతను తెలిపాడు. ఫోటోలు తీసుకోవడానికి పృథ్వీ నిరాకరించడంతో వారిద్దరూ గొడవకు దిగారని అతను తెలిపాడు. ఇంతలో పృథ్వీ తన మిత్రుడికి ఫోన్ చేసి హోటల్ మేనేజ్‌మెంట్‌కు చెప్పి వారిని అక్కడ నుంచి పంపించివేయాలని కోరాడు. వారిని బయటకు పంపించివేయడంతో పృథ్వీ కోసం వారు బయటే వేచి ఉన్నారని, వారిద్దరితోపాటు మరికొందరు వ్యక్తులు కూడా బేస్‌బాల్ బ్యాట్లతో ఉన్నారని అతను ఆరోపించాడు.
కారులో వెళ్లిపోతున్న తమను మరో కారులో వాళ్లు వెంబడించి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడ్డుకున్నారని, బేస్‌బాల్ బ్యాట్‌తో కారు విండ్ స్క్రీన్‌ను పగలగొట్టారని షా మిత్రుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ. 50వేలు కూడా ఇవ్వాలని వాళ్లు డిమాండ్ చేశారని, ఇవ్వకపోతే బోగస్ పోలీసు కేసు నమోదు చేస్తామని బెదిరించారని అతను ఆరోపించాడు. అయితే ఈ ఫిర్యాదులో చేసిన ఆరోపణలను ఇతర అనుమానితులు కూడా ఖండించారు.
Please stay miles away from such people & such scenes @PrithviShaw 🙏
pic.twitter.com/rwRFk73F4Q— Sushant Mehta (@SushantNMehta) February 16, 2023