Saturday, November 16, 2024

అందుకే స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులోని వాస్తవాలను ప్రజలకు వివరించేందుకే స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు నిర్వహిస్తున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. స్ట్రీట్ మీటింగ్‌లకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని, ఈనెల 25లోపు రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల మీటింగ్‌లను పూర్తి చేస్తామన్నారు. ఈ సమావేశాల అనంతరం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంలో బహిరంగ సభలను నిర్వహిస్తామని చెప్పారు.

అనంతరం ఉమ్మడి పది జిల్లా కేంద్రాల్లో బహిరంగ సభలను ఏర్పాటు చేస్తామన్నారు. వీటి తర్వాత రాష్ట్ర స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ బహిరంగ సభకు బిజెపి అగ్రనేతలను ఆహ్వానిస్తామన్నారు. గురువారం పరిగి నియోజకవర్గంలో బిజెపి నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న బండి సంజయ్ మాట్లాడారు.. గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులు మినహా రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా విడుదల చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో కొందరు సర్పంచ్‌లు ఆత్మహత్యయత్నాలకు పాల్పడుతున్నారని ఆయన చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా పరిగి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీరు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు మాట తప్పారని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News