Sunday, January 19, 2025

ప్రేమించాడు… యువతిపై అఘాయిత్యం… పెళ్లికి నిరాకరించాడు..

- Advertisement -
- Advertisement -

అమరావతి: సోషల్ మీడియాలో పరిచయం కావడంతో ప్రేమించానని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు… శారీరకంగా ఇద్దరు ఒకటయ్యారు.. చివరలో పెళ్లికి నిరాకరించడంతో యువతి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా సూర్యారావుపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుంటూరు జిల్లాకు చెందిన యువతి(22) విజయవాడలో ఓ దుకాణంలో ఉద్యోగం చేస్తుంది. ఫేస్‌బుక్‌లో రమేశ్ బాబు అనే యువకుడు పరిచయమయ్యాడు. రమేష్ బాబు ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. కానీ ఆమె మాత్రం పట్టించుకోకుండా మరో యువకుడిని పెళ్లి చేసుకుంది. భర్తతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటుంది. ఆమె సూర్యారావు పేటలోని ఓ ఆస్పత్రి పని చేస్తుండగా పాత పరిచయం ఉన్న రమేష్ కలిశాడు. తాను ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని ఆమె నమ్మించాడు. ఇద్దరు వెళ్లి ఒక రూమ్ అద్దెకు తీసుకొని అందులో ఉండిపోయారు. రెండు రోజులు ఆమెతో అతడి శారీరకంగా దగ్గరయ్యారు. తాను పెళ్లి చేసుకొనని అతడు నిరాకరించడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేసింది. నిందితుడిపై అత్యాచారం కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News