Monday, December 23, 2024

నిర్భయంగా వార్తలు కొనసాగిస్తాం: బిబిసి

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: బిబిసికి చెందిన న్యూఢిల్లీ, ముంబై కార్యాలయాలలో మూడు రోజుల పాటు సమగ్రంగా సోదాలు నిర్వహించి డిజిటల్ పత్రాలను, ఫైళ్లను కాపీ చేసుకున్న ఆదాయం పన్ను శాఖ(ఐటి) అధికారులు గురువారం రాత్రి వెనుదిరిగారు. ఈ విషయాన్ని బ్రిటన్‌కు చెందిన బ్రిటిష్ బ్రాడ్‌కాసింగ్ కార్పొరేషన్(బిబిసి) ట్విటర్ ద్వారా తెలిపింది. అధికారులకు సహకరిస్తామని, త్వరలోనే ఈ వ్యవహారం కొలిక్కిరాగలదని బిబిసి ఆశాభావం వ్యక్తం చేసింది.

తమ సిబ్బందిలో కొందరిని అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారని, కొందరు రాత్రుళ్లు కూడా కార్యాలయంలోనే ఉండిపోవలసి వచ్చిందని, తమ సిబ్బంది సంక్షేమమే తమకు అత్యంత ప్రాధాన్యమని తెలియచేసిన బిబిసి తమ సిబ్బంది అండగా ఉంటామని హామీ ఇచ్చింది. బిబిసి విశ్వసనీయరమైన, స్వతంత్ర మీడియా సంస్థని, నిర్భయంగా వార్తలు రాసే తమ జర్నలిస్టులకు బాసటగా నిలబడతామని బిబిసి స్పష్టం చేసింది.

కాగా..2002 నాటి గుజరాత్ అల్లర్లలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఆరోపిస్తూ బిబిసి విడుదల చేసిన రెండు భాగాల డాక్యుమెంటరీ వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో ఐటి శాఖ బిబిసి కార్యాలయాలపై దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News