Friday, December 20, 2024

చంద్రబాబు అంటేనే షో: అంబటి

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: టిడిపి దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. శుక్రవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం పూర్తి కోసం చిత్తశుద్ధిగా పని చేస్తున్నామన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రచార యావ తప్ప మరొకటి లేదన్నారు. టిడిపి హయాంలో పోలవరాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. కాఫర్ డ్యామ్ నిర్మించకుండా డాయాఫ్రం వాల్ నిర్మించారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు చేసిన పాపాల వల్లే పోలవరానికి ఈ దుస్థితి ఏర్పడిందని, బాబు నిర్వాకంతో ప్రాజెక్టు పూర్తిగా దెబ్బతిందని విమర్శించారు. స్పిల్‌వే, అప్పర్, లోయర్ కాఫర్ డ్యామ్‌లను తామే పూర్తి చేశామని, బాబు హయాంలో షోవర్క్ తప్ప మరేమీ లేదని విమర్శించారు. బాబు తప్పిదం వల్ల పోలవరానికి తీవ్ర నష్టం జరిగిందని, ఆ నష్టాలను తాము పూడ్చుతున్నామని వివరించారు. ఆర్‌అండ్‌ఆర్ కింద అత్యధికంగా ఖర్చు చేసింది తామేనని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News