సిటిబ్యూరోః బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని దొంగగా మారిన యువకుడిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.నిందితుడి వద్ద నుంచి 32 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…నగరంలోని రాంగోపాల్‌పేటకు చెందిన సూరజ్ మలానీ ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసగా మారాడు. ఈ క్రమంలోనే బెట్టింగ్‌లో భారీగా డబ్బులు నష్టపోయాడు. చేసిన అప్పులు తీర్చేందుకు తన బాబాయ్ ఇంట్లోనే దొంగతనం చేశాడు. రాంగోపాల్ పేటకు చెందిన గోపాల్‌దాస్ ఈనెల 10వ తేదీన ఫ్యాక్టరీలో కుటుంబంతో పూజ నిర్వహించిన తర్వాత ఇంటికి వచ్చారు.
గోపాల్‌దాస్ భార్య బంగారు ఆభరణాలు పెట్టుకునేందుకు అల్మారా తెరవగా అందులో ఆభరణాలు కన్పించలేదు. వెంటనే ఈ విషయం భర్తకు చెప్పింది, అనుమానం వచ్చిన గోపాల్ దాస్ ఇంట్లోని సిసి కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించాడు. అందులో తన సోదరుడి కుమారుడు సూరజ్ ఓ బ్యాగును తన స్కూటర్ డిక్కీలో పెట్టుకుని పోతున్నది చూశాడు. వెంటనే రాంగోపాల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్ శ్రీనాధ్, ఎస్సై శ్రీకాంత్ తదితరులు దర్యాప్తు చేశారు.