Monday, January 6, 2025

అదుపు తప్పి కారు బోల్తా..

- Advertisement -
- Advertisement -

నందిగామ: వింధుకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఇంటికి వస్తున్న క్రమంలో కారు అదుపు తప్పి బోల్తా పడిన ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలైన ఘటన నందిగామ మండలంలోని నర్సప్పగూడ గ్రామ సమీపంలోని బ్రిడ్జివద్ద చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నేదునూరు గ్రామానికి చెందినవారు నందిగామ మండలంలోని చేగూరు గ్రామంలో జరుగుతున్న వింధులో పాల్గొన్నారు.

తిరుగు ప్రయాణంలో డ్రైవర్ ఒక్కడే కారులో వస్తుండగా నర్సప్పగూడ శివారులోకి రాగానే కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయని, ప్రమాదకర ప్రదేశంలో ఎలాంటి సూచిక బోర్డు లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించిన సూచిక బోర్డును ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News