గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్
హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ కోరారు. శనివారం మహాశివరాత్రి పురస్కరించుకుని కోయంబత్తూరులోని ఈశా ఆశ్రమానికి చేరుకున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ దంపతులు ఈశా ఫౌండేషన్ స్కూల్ విద్యార్థులతో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు.
ఎంపి సంతోష్‌కుమార్ ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే మహాశివరాత్రి వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానించిన సద్గురు ఆహ్వానం మేరకు వేడుకల్లో ఎంపి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని స్కూల్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలు, పలు అంశాలపై చర్చించి విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఈశా వాలంటీర్లు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.