హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం రేషన్‌కార్డులున్న కుటుంబాలకు చిరుధాన్యాలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. పౌరసరఫరాల సంస్థ ద్వారా చిరుధాన్యాలను పంపిణీ చేసేందకు సంబంధించిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో తొలుత ప్రయోగాత్మకంగా రాయలసీమలో ఈ పైలెట్ ప్రాజెక్టుకు అమలు చేయనుంది. ప్రతినెల డీలర్ల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యంలో ఇక నుంచి రెండు కిలోల బియ్యానికి బదులుగా రాగులు, జొన్నలు పంపిణీ చేయనుంది.
వ్యవసాయంలో చిరుధాన్య పంటల సాగును ప్రోత్సహిస్తున్న జగన్‌సర్కారు రైతులు పండించిన చిరుధాన్య పంటలను పౌరసరఫరాల సంస్థద్వారానే సేకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం చిరుధాన్య పంటలకు కనీస మద్దతు ధరలను కూడా ప్రకటించింది. క్వింటాలకు జొన్నలు రూ.2970, మల్ధండి రకం రూ.2990 ధర నిర్ణయించింది. రాగులు మద్దతు ధర రూ.3578గా నిర్ణయించింది.