Tuesday, November 26, 2024

సహజీవనం కాదు.. వివాహ బంధమే!: ఢిల్లీ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో యువతిని హత్య చేసి ఫ్రీజర్‌లో దాచిపెట్టిన ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు సాహిల్ గెహ్లోట్ బాధిత యువతి నిక్కీ యాదవ్‌ను చార్జర్ వైర్‌తో కారులోనే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో ఇప్పటికే వెల్లడయింది. ఇన్ని రోజులూ వీరిద్దరూ సహజీవనంలో ఉన్నారంటూ వార్తలు రాగా.. వాటిలో నిజం లేదని, వారిద్దరూ పెళ్లి చేసుకున్నారని ఇప్పుడు వెల్లడయింది. అంతేకాదు నిక్కీ యాదవ్ హత్యలో సాహిల్ కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉన్నట్లు విచారణలో భాగంగా పోలీసులు గుర్తించారు. సాహిల్, నిక్కీలు 2020లోనే వివాహం చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ నోయిడాలోని ఆర్య సమాజ్ లో వీరి వివాహం జరిగింది.

అయితే ఈ వివాహం సాహిల్ కుటుంబానికి ఇష్టం లేదని ఆ వర్గాలు తెలిపారు. వారు సోహిల్‌కు వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయించారని, ఆ విషయం నిశ్చితార్థం ముందు రోజు వరకు నిక్కీకి తెలియదని, దాని విషయమై జరిగిన గొడవ కారణంగానే నిక్కీని సాహిల్ హత్యచేశాడని పోలీసులు తెలిపారు. ఈ హత్యలో సాహిల్‌తో పాటుగా అతని కటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందని విచారణలో భాగంగా పోలీసులు గుర్తించారు. దీంతో సాహిల్ తండ్రి వీరేంద్ర సింగ్, మరో ముగ్గురు కుటుంబ సభ్యులతో పాటుగా ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 9న సాహిల్‌కు మరో యువతితో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం గురించి నిక్కీ సాహిల్‌ను ప్రశ్నించింది.

ఆ తర్వాత ఇద్దరూ కారులో ఢిల్లీలోని పలు ప్రదేశాలకు వెళ్లారు. కారులో మరోసారి నిక్కీ పెళ్లి ప్రస్తావన తేవడంతో ఇద్దరి మధ్యా తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో నిక్కీని అంతమొందించాలని నిర్ణయించుకున్న సాహిల్ చార్జింగ్ కేబుల్‌ను నిక్కీ మెడకు ఉరి బిగించి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. తరువాత వరుసకు సోదరుడైన వ్యక్తి, మరో స్నేహితుడితో కలిసి నిక్కీ శవాన్ని ఫ్రీజర్‌లో దాచాడు. ఆ తర్వాత ఏమీ జరగనట్లు పెళ్లి వేడుకలో పాల్గొన్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News