Monday, December 23, 2024

బాదంపప్పుతో మధుమేహ ప్రమాద కారకాలు తగ్గే అవకాశం..

- Advertisement -
- Advertisement -

ప్రతి రోజూ బాదంపప్పును 12వారాల పాటు తినడం వల్ల ఇన్సులిన్‌ ప్రతిరోధకత తగ్గడంతో పాటుగా పాన్‌క్రియాటిక్‌ పనితీరు మెరుగుపడటం, బ్లడ్‌ గ్లూకోజ్‌ స్థాయి నియంత్రణలో సహాయపడుతుందని నూతన అధ్యయనం వెల్లడించింది. అంతేనా, బాదములు తిన్నవారిలో శరీర బరువు తగ్గడం, బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ) తగ్గడం, నడుం చుట్టు కొలత తగ్గడం వంటివి చూడటంతో పాటుగా తమ కొలెస్ట్రాల్‌ స్ధాయిలను సైతం తగ్గించుకోవడం కనిపించింది.

ప్రపంచవ్యాప్తంగా అధిక శరీర బరువు, మధుమేహ సమస్యలు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ రెండు సమస్యలూ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. అందువల్ల, ఒకే తరహా చికిత్స రెండింటికీ తగిన పరిష్కారం చూపుతుంది. బాదములు ప్రతి రోజూ తినడం వల్ల ఆరోగ్యమూ మెరుగుపడుతుంది.

ఈ అధ్యయనానికి చెన్నైలోని మద్రాస్‌ డయాబెటీస్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ వద్ద చీఫ్‌ ఆఫ్‌ డయాబెటీస్‌ రీసెర్చ్‌ మరియు అధ్యక్షులు విశ్వనాథన్‌ మోహన్‌, ఎండీ, పీహెచ్‌డీ ,డీఎస్‌సీ నేతృత్వం వహించగా, ఆర్‌ ఎం అంజన, ఎండీ,పీహెచ్‌డీ, వైస్‌ ప్రెసిడెంట్‌ – మద్రాస్‌ డయాబెటీస్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ; రిచార్డ్‌ మ్యాట్స్‌ , పీహెచ్‌డీ, ఎంపీహెచ్‌, ఆర్‌డీ, డిస్టింగ్యుష్డ్‌ ప్రొఫెసర్‌, న్యూట్రిషన్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌– పుర్డ్యు యూనివర్శిటీ ; జోర్డీ సలాస్‌, ఎండీ, పీహెచ్‌డీ, ప్రొఫెసర్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ బ్రోమటాలజీ (ఫుడ్‌ సైన్స్‌)యూనివర్శిటట్‌ రోవిరా ఐ విర్గ్లి మరియు వాల్తెర్‌ విల్లెట్‌, ఎండీ, డాక్టర్‌ పీహెచ్‌, ప్రొఫెసర్‌ ఆఫ్‌ ఎపిడెమియాలజీ అండ్‌ న్యూట్రిషన్‌, హార్వార్డ్‌ యూనివర్శిటీ లు తగిన సహకారం అందించారు. పరిశోధకులు 43 గ్రాములు (1.5 ఔన్సులు) ముడి బాదములను ప్రతి రోజూ 12 వారాల పాటు తినడం వల్ల ఇన్సులిన్‌పై కలుగుతున్న ప్రభావం, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌, సెరమ్‌ లిపిడ్‌ మార్కర్లను ఆసియన్‌ భారతీయ పురుషులు మరీ ముఖ్యంగా అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్న వారిలో పరిశోధించారు.

‘‘మా బాదముల వినియోగదారులలో శరీర బరువుతో పాటుగా బ్లడ్‌ షుగర్‌ కూడా మెరుగుపడింది’’ అని డాక్టర్‌ మోహన్‌ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సమస్యగా ఊబకాయం పరిణమిస్తుంది. ఊబకాయం వల్ల దీర్ఘకాల వ్యాధులైన మధుమేహం లాంటివి కనిపిస్తున్నాయి. ఇది అతి క్లిష్టమైన సమస్యగా మేము చూస్తున్నాము. ఇతర స్నాక్‌లకు బదులుగా బాదములు తినవలసినదిగా మేము ప్రోత్సహిస్తున్నాము. తద్వారా వారు బరువు నియంత్రించుకోవడంతో పాటుగా మధుమేహ వ్యాధుల భారమూ తగ్గించుకోగలరు’’ అని అన్నారు.

‘‘స్టడీ పేపర్‌ తొలి రచయిత, యూనివర్శిటీ ఆఫ్‌ మద్రాస్‌ వద్ద పీహెచ్‌డీ స్కాలర్‌ గాయత్రి రాజగోపాల్‌ సైతం ఈ అధ్యయనంలో పాన్‌క్రియాటిక్‌ ఆరోగ్యం మెరుగుపడటం పట్ల ఆసక్తిని కనబరిచారు. బాదములు తింటున్న వ్యక్తులలో బీటా సెల్స్‌ వృద్ధి చెందడం చూశాము. పాన్‌ క్రియాస్‌లో ఉండే ఈ కణాల వల్ల ఇన్సులిన్‌ మెరుగుపడుతుంది. మనందరికీ బాదములు వల్ల ఆకలి తగ్గుతుందని తెలుసు. టైప్‌ 2 మధుమేహులకు ఇది ఆరోగ్యవంతమైన స్నాక్‌గా నిలుస్తుంది’’ అని అన్నారు.

బాదములు వల్ల గుండె ఆరోగ్యం సైతం మెరుగుపడుతుందని పరిశోధకులు గుర్తించారు. బాదములు తినే వారిలో టోటల్‌ కొలెస్ట్రాల్‌, ట్రై గ్లిసరైడ్స్‌ కూడా గణనీయంగా తగ్గాయి. కార్డియో వాస్క్యులర్‌ వ్యాధుల ప్రమాదం కూడా తగ్గింది.

‘‘మా టీమ్‌ రోగులను తమ ఆహారంలో ప్లాంట్‌ ఫుడ్స్‌ను జోడించుకోమని వెల్లడించింది. దీని కారణంగా డీప్‌ ఫ్రై స్నాక్స్‌ తీసుకోవడం గణనీయంగా తగ్గుతుంది’’ అని అంజన అన్నారు. ‘‘బాదములలో ఆరు గ్రాముల ప్లాంట్‌ ప్రోటీన్‌ ఉంటుంది (ప్రతి 28 గ్రాముల బాదములలో). దీనిలో విటమిన్‌ ఈ ఉండటంతో పాటుగా కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించే గుణాలు కూడా ఉన్నాయి. అంతేకాదు , శరీర బరువు నియంత్రించడం, పాన్‌ క్రియాటిక్‌ పనితీరు మెరుగుపరచడం, బ్లడ్‌ షుగర్‌ నియంత్రించడంలో కూడా బాదములు తోడ్పడతాయి’’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News