Monday, December 23, 2024

ట్యాంక్‌బండ్‌ఫై ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌పై నిర్వహించనున్న సండే ఫండే సందర్భంగా ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ట్రాఫిక్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. వాహనదారులు ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.
లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే వామనాలను అంబేద్కర్ స్టాట్యూ నుంచి తెలుగుతల్లి , ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు.
తెలుగుతల్లి నుంచి అప్పర్ ట్యాంక్ బండ్‌వైపు వెళ్లే వాహనాలను అంబేద్కర్ స్టాట్యూ మీదుగా లిబర్టీ, హిమాయత్‌నగర్‌వైపు మళ్లిస్తారు.
ఇక్బాల్ మినార్ మీదుగా సికింద్రాబాద్ వెళ్లే వాహనాలను ఓల్డ్ సెక్రటేరియట్ మీదుగా తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు.
కర్బాలా మైదాన్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్లే వాహనాలను సెయిలింగ్ క్లబ్ మీదుగా కవాడిగూడ డిబిఆర్ మిల్స్, లోయర్ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ టెంపుల్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు.
డిబిఆర్ మిల్స్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్‌వైపు వెళ్లే వాహనాలను డిబిఆర్ మిల్స్ మీదుగా గోషాలా, కవాడిగూడ,జబ్బర్ కాంప్లెక్స్, బైబిల్ హౌస్‌వైపు మళ్లిస్తారు.
పార్కింగ్ ప్రాంతాలు…
అంబేద్కర్ స్టాట్యూ టు లేపాక్షి, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఆదర్శనగర్. సెయిలింగ్ క్లబ్ నుంచి చిల్డ్రన్ పార్క్, బుద్ధభవన్ బ్యాక్‌సైడ్ నుంచి నెక్లెస్ రోడ్డు వరకు, ఎన్‌టిఆర్ గ్రౌండ్స్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News