- Advertisement -
న్యూఢిల్లీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా నడుమ న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ పోటాపోటీగా సాగుతున్నది. ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకే కట్టడిచేసిన టీమిండియా స్పిన్నర్లు మరోసారి సత్తా చాటారు. ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా విజృంభించడంతో ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్‌లో 113 రన్స్ కే కుప్పకూలిపోయింది. దీంతో 115 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ ను జడేజా తన బౌలింగ్ తో భయపెట్టాడు. వరుగా వికెట్లు తీస్తూ ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బకొట్టాడు. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై జడేజా ఒక్కడే ఏడు వికెట్లు తీసి తన కెరీర్ లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు.
- Advertisement -