తారకరత్న భౌతికకాయాన్ని సోమవారం ఉదయం 9 గంటల నుంచి హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. అయితే తారకరత్న భార్య, పిల్లల బాధ్యత తనదేనని ఎమ్మెల్యే బాలకృష్ణ మాటిచ్చారని ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. బాలకృష్ణ నిర్ణయించిన సమయానికే అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు. తారకరత్న మరణం తనను ఎంతో బాధించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అస్వస్థతకు గురైన తారకరత్న సతీమణి…
తన భర్త తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో శోక సంద్రంలో మునిగిపోయిన భార్య అలేఖ్యా రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. భర్త మరణం తర్వాత శనివారం సాయంత్రం నుంచి ఆమె ఏమీ తినలేదు. దీంతో ఆమె పూర్తిగా నీరసించి అస్వస్థతకు గురయ్యారు. శనివారం నుంచి విలపిస్తూనే ఉన్నారు. బంధులు, అయినవారు ఎంత ధైర్యం చెబుతున్నా ఆమె కన్నీరు పెడుతూనే ఉన్నారు. తారకరత్న కూతురు నిష్క తండ్రి మృతదేహాన్ని చూసి భోరున విలపించింది.