Friday, November 15, 2024

మరింత దిగజారిన అదానీ నికర సంపద

- Advertisement -
- Advertisement -

ముంబై: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వచ్చిన నాటి నుంచి అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనమవుతున్న సంగతి తెలిసిందే. నేడు వారారంభం(సోమవారం)లోనే అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు మళ్లీ పతనమయ్యాయి. ప్రస్తుతం గౌతమ్ అదానీ నికర సంపద రెండేళ్ల కనిష్ఠానికి పతనమైంది. హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడినప్పుడు ఆయన సంపద 119 బిలియన్ డాలర్లుగా ఉండింది. కానీ నేడు అది 49.1 బిలియన్లకు పతనమైంది. దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన స్థానం 25 స్థానానికి పడిపోయింది. నేడు అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు తమ లోయర్ సర్కూట్‌లో లాక్ అయ్యాయి. కాగా అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ గ్రీన్, అదానీ పోర్ట్ , ఏసిసి, అంబుజా సిమెంట్, ఎన్‌డిటివి షేర్లు కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.

ఇదిలావుండగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్‌ఐఎల్) చైర్మన్ ముకేశ్ అంబానీ సైతం ప్రపంచ టాప్ 10 బిలియనీర్స్ జాబితాలో తన స్థానం కోల్పోయారు. ఆయన నికర సంపద 83.6 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆయన ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు. కాగా భారత అత్యంత సంపన్నుడిగా మాత్రం ఆయన తన స్థానం నిలుపుకున్నారు. కాకపోతే ఆసియాలో అత్యంత సంపన్నుడన్న ట్యాగ్‌ను కోల్పోయారు.

ప్రపంచ టాప్ బిలియనీర్ల జాబితాలో ఇప్పుడు ఎనిమిది మంది అమెరికన్లు, ఒక ఫ్రాన్స్ జాతీయుడు, ఒక మెక్సికన్ జాతీయుడు ఉన్నారు. ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెనార్డ్ అర్నాల్ట్ తన నికర సంపద 192 బిలియన్ డాలర్లతో జాబితా అగ్రస్థానంలో ఉన్నారు. ఇదిలావుండగా ముకేశ్ అంబానీ ప్రపంచ 100 బిలియన్ క్లబ్ నుంచి వైదొలిగినా ఆయన తన కంపెనీని టెలికామ్, డిజిటల్ రంగాల్లో విస్తరిస్తున్నారు. ఆయన వ్యాపారం విజయవంతంగానే కొనసాగుతోంది. ఆయన భవిష్యత్తులో తిరిగి టాప్ ఫైవ్ బిలియనీర్ల జాబితాలోకి వస్తారని, 100 బిలియన్ క్లబ్‌లోకి వస్తారని భావిస్తున్నారు.

Adani networth

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News