Saturday, November 23, 2024

చాట్ జిపిటి వివాదాస్పద వ్యక్తుల్లో ప్రధాని మోడీ, మస్క్..

- Advertisement -
- Advertisement -

చాట్ జిపిటి వివాదాస్పద వ్యక్తుల్లో ప్రధాని మోడీ, మస్క్
పుతిన్, ట్రంప్, జిన్‌పింగ్ తదితరుల పేర్లూ ప్రస్తావన
నెటిజన్ పోస్టును రీట్వీట్ చేసిన మస్క్

వాషింగ్టన్/న్యూఢిల్లీ: సాంకేతిక ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తోన్న ‘చాట్ జిపిటి’ రోజురోజుకు చర్చనీయాంశగా మారుతోంది. కృత్రిమ మేధ’ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో పనిచేసే ఈ టూల్ ఇస్తున్న సమాధానాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా ట్విట్టర్ సిఇఒ ఎలాన్ మస్క్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, కిమ్ కర్దాషియన్ తదితరులను వివాదాస్పద వ్యక్తులుగా జవాబు చెప్పంది.

అంతేకాదు వీరిని ప్రత్యేకంగా పరిగణించాలని కూడా చెప్పింది. న్యూజిలాండ్ మాజీ ప్రధాని జెసిండా ఆర్డెన్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్‌గ్సేట్ , జర్మన్ మాజీ చాన్సలర్ ఏంజెలా మెర్కల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుల్ మేక్రాన్, కెనెడా ప్రధాని జస్టిన్ ట్రూడోను వివాదరహితులుగా పేర్కొంది. ఐజాక్ లాటెరెల్ అనే వ్యక్తి సంధించిన ప్రశ్నకు చాట్ జిపిటి ఈ రకమైన సమాధానం ఇచ్చింది. అదే జాబితాను ఐజాక్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

‘ప్రత్యేకంగా పరిగణించేందుకు మస్క్, ట్రంప్ అర్హులు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాత్రం కాదు’ అంటూ రాసుకొచ్చారు. కాగా, ఐజాక్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన చాట్ జిపిటి సమాధానాలకు ఎలాన్ మస్క్ స్పందించారు. ఐజాక్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. రెండు ఆశ్చర్యార్థకాలను ఉంచారు (!!). ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ఇదిలావుంటే చాట్ జిపిటి టూల్‌తో మాట్లాడేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. తమకు తెలియని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను చాట్ జిపిటిని అడిగి తెలుసుకుంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News