Wednesday, January 22, 2025

కన్నీటి వీడ్కోలు..

- Advertisement -
- Advertisement -

తారకరత్నకు కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం స్మశాన వాటికలో తండ్రి మోహన్‌కృష్ణ చేతుల మీదుగా అంత్యక్రియలు జరిగాయి. అంతకు ముందు చివరిసారిగా తారకరత్న నుదిటిపై తండ్రి మోహనకృష్ణ ముద్దుపెట్టి కన్నీరుమున్నీరయ్యారు. అంతరం చితికి మోహనకృష్ణ నిప్పుపెట్టారు. కాగా తారకరత్న పాడెను బాబాయిలు బాలకృష్ణ, రామకృష్ణ, ఇతర బంధువులు మోశారు. ఈ అంత్యక్రియల్లో ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, చంద్రబాబు, లోకేష్, పురందేశ్వరి, విజయసాయి రెడ్డి, కుటుంబసభ్యులు, అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

అంతకుముందు ఫిల్మ్‌ఛాంబర్‌లో ఉంచిన తారకరత్న భౌతికకాయానికి సినీ ప్రముఖులు ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, వెంకటేష్, డి.సురేష్ బాబు, ఆదిశేషగిరి రావు, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, టి.ప్రసన్న కుమార్ తదితరులు పూలతో తుది నివాళులర్పించారు. తమ అన్నయ్య పార్థివదేహాన్ని చూసి ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్‌రామ్‌లు కన్నీటిపర్యంతం అయ్యారు. ఇక తారకరత్న తల్లిదండ్రులు కూడా కొడుకును చివరి చూపు చూసేందుకు ఛాంబర్‌కు వచ్చారు. తారకరత్న తల్లి కొడుకు భౌతికకాయాన్ని చూసి బోరున విలపించారు. అనంతరం ఫిల్మ్‌ఛాంబర్ నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం వరకు కొనసాగింది. ఆయనను కడసారి చూసేందుకు భారీగా అభిమానులు, నందమూరు అభిమానులు తరలివచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News