Monday, December 23, 2024

వాలీబాల్ అవార్డు గ్రహీతకు ఘన సన్మానం

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: ఖేలో ఇండియా ఖేలో భాగంగా నిజాం గ్రౌండ్‌లో నిర్వహించిన క్రీడల్లో అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు, అర్జున్ అవార్డు గ్రహీత రవికాంత్‌రెడ్డిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బంగారు లక్ష్మణ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రవికాంత్‌రెడ్డి వాలీబాల్‌లో ఇండియా జట్టుకు తెలంగాణ ఆణిముత్యమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఒలింపిక్ సంఘ కార్యదర్శి జగదీష్ యాదవ్, ఉపాధ్యక్షుడు డా.ఎస్.ఆర్.ప్రేంరాజ్ పాల్గొన్నారు. కేంద్రమంత్రి రవికాంత్‌రెడ్డి సన్మానించడం పట్ల నిజామాబాద్ జిల్లావాలీబాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గోపాల్ శర్మ, ఉమా మహేశ్వర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ రత్నాల రాజాగౌడ్, ఉపాధ్యక్షులు గాదారి సంజీవ్‌రెడ్డి, సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News