Saturday, December 28, 2024

ఏజన్సీ మట్టిలోని.. మాణిక్యం త్రిష

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / భద్రాచలం: మహిళల అండర్ 19 ప్రపంచ కప్ క్రికెట్‌లో అద్భుతమైన ప్రతిభ చాటి, ఇండియా ప్రపంచ కప్ గెలవడంలో కీలక భూమిక పోషించిన భద్రాచలం ఆడబిడ్డ గొంగడి త్రిషను భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య బుధవారం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని తన బిడ్డని ఈస్థాయికి తీసుకొచ్చిన తండ్రి రామిరెడ్డిని చూస్తే గర్వం ఉందని అన్నారు. సాధారణంగా ఆడపిల్ల పుడితే ..డాక్టర్ లేదా ఇంజనీరింగ్ వంటి కోర్సులు చదివించి, మంచి అబ్బాయితో పెళ్లి చేసి వేరే ఇంటికి పంపిస్తారని..కానీ రామిరెడ్డి మాత్రం తన బిడ్డను ప్రపంచం గర్వించ దగ్గ క్రీడాకారిణిగా తీర్చిదిద్దటం భద్రాచలం ప్రాంతవాసులు గర్వించవలసిన విషయమని అన్నారు.

అలాగే త్రిష కూడా తన తండ్రి కలలను ఒమ్ము చేయకుండా.. కష్టపడి ఈస్థాయికి చేరుకోవడం చాలా గొప్ప విషయమని, ఏజన్సీ ప్రాంతంలో పుట్టిన మట్టిలో మాణిక్యం త్రిష అని కొనియాడారు. త్రిష కూడా ఇదే కృషి, పట్టుదలతో మహిళా సీనియర్ టీంకి ఆడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సరెళ్ల నరేష్, భద్రాచలం హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి, తెల్లం నరేష్,లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News