ముంబై: IMDb(http://www.IMDb.com), చలనచిత్రాలు, టీవీ షోలు, సెలబ్రిటీల గురించిన సమాచారం కోసం ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మరియు విశ్వసనీయ సంస్థ అయిన IMDb ఈరోజు పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ ఫీచర్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. భారతీయ చలనచిత్రాలు మరియు వెబ్ సిరీస్‌లలో ట్రెండింగ్ స్టార్‌లు, చిత్రనిర్మాతలను ట్రాక్ చేయడానికి అభిమానులకు ఇది ఒక సరికొత్త మార్గం.
ఆండ్రాయిడ్ మరియు IOS కోసం IMDb యాప్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న ఈ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ ఫీచర్, ప్రతి వారం టాప్ ట్రెండింగ్ ఇండియన్ ఎంటర్‌టైనర్‌లు మరియు ఫిల్మ్‌మేకర్‌లను హైలైట్ చేస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా IMDbకు 200 మిలియన్లకు పైగా ఉన్న నెలవారీ సందర్శకులపై ఆధారపడి ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా ప్రతివారం సెలబ్రిటీస్ ఎవరు ట్రెండ్ అవుతున్నారో చూసి అభిమానులు తమకు ఇష్టమైన ఎంటర్ టైనర్స్ ను ఫాలో అవుతూ, కొత్త టాలెంట్ ను కనిపెట్టవచ్చు.
IMDb ఇండియా హెడ్ యామిని పటోడియా దీని గురించి మాట్లాడుతూ “భారతదేశంలో అనేకమంది ప్రతిభావంతులు, చిత్రనిర్మాతలు ప్రాంతీయ, జాతీయ సరిహద్దులను దాటి అపారమైన అభిమానాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రపంచంలో మాకున్న ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని వారిలోని ఆసక్తిని గమనించడంలో IMDb ప్రత్యేక స్థానం పొందిందని” అన్నారు. పాపులర్ ఇండియన్ సెలెబ్రిటీస్ ఫీచర్ తాజాగా విడుదల అయిన చిత్రాలు మరియు వివిధ వార్తా సంఘటనల ఆధారంగా అద్భుతమైన కెరీర్ మూమెంట్ ఉన్న సెలబ్రిటీలను హైలైట్ చేస్తుంది.
ఫిబ్రవరి 20 వారంలో ప్రముఖ భారతీయ సెలబ్రిటీల ఫీచర్‌లో టాప్ 20 ట్రెండింగ్ పేర్లు:
1. రాశీ ఖన్నా
2. షారుఖ్ ఖాన్
3. విజయ్ సేతుపతి
4. రెజీనా కసాండ్రా
5. ఆదిత్య చోప్రా
6. దీపికా పదుకొనె
7. ఖాదర్ ఖాన్
8. భువన్ అరోరా
9. అనుపమ్ ఖేర్
10. కియారా అద్వానీ
11. ఆయేషా కంగ
12. ఐశ్వర్య రాయ్ బచ్చన్
13. షాహిద్ కపూర్
14. కుబ్రా సేఠ్
15. రామ్ చరణ్ తేజ
16. అంజలి శివరామన్
17. సల్మాన్ ఖాన్
18. యశ్ చోప్రా
19. కృష్ణ డి.కె.
20. నోరా ఫతేహి
పాపులర్ ఇండియన్ సెలెబ్రిటీస్ ఫీచర్ భారతీయ వినోదంలో ప్రపంచ పోకడలను ప్రతిబింబిస్తుంది
· ఈ వారం పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ ఫీచర్ ఫర్జీ (ప్రైమ్ వీడియో), ది రొమాంటిక్స్, క్లాస్ (నెట్ ఫ్లిక్స్), పఠాన్ (ఇప్పుడు థియేటర్లలో ఉంది) వంటి ట్రెండింగ్ టైటిల్స్ నుండి ప్రతిభను హైలైట్ చేసింది.
· ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ ఫర్జీ నుండి ఆరుగురు నటీనటులు జాబితాలో టాప్ 20లో ఉన్నారు. విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్, రెజీనా కసాండ్రా, భువన్ అరోరా, కుబ్రా సేఠ్ లతో పాటు రాశి ఖన్నా వీరిలో నెం.1 స్థానంలో ఉంది. వీరితో పాటు సిరీస్ సహ-నిర్మాత కృష్ణ డీకే కూడా ఈ వారం ఈ జాబితాలో ఉన్నారు.
· యష్ రాజ్ ఫిల్మ్స్‌కి చెందిన ఆదిత్య చోప్రా, అతని ఇంటర్వ్యూ నెట్‌ఫ్లిక్స్ డాక్యుసీరీస్ ది రొమాంటిక్స్ వల్ల 5వ స్థానంలో ఉన్నాడు.
· రికార్డు స్థాయి బాక్సాఫీస్ సెన్సేషన్ ‘పఠాన్’ లో స్టార్స్ గా నిలిచిన షారుఖ్ ఖాన్ (నెం.2), దీపికా పదుకొణె (నెం.6) ఈ సినిమా విడుదలై నెల రోజులు గడుస్తున్నా ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
· ఇటీవల ఒక ఆన్ లైన్ ఇంటర్వ్యూలో ట్రెండింగ్ అయిన నటుడు ఖాదర్ ఖాన్, IMDb వినియోగదారులు అతని గురించి నటుడిగా, రచయితగా మరియు నిర్మాతగా తన సుదీర్ఘ కెరీర్ గురించి సమాచారం వెతకడంతో ఈ జాబితాలో ఉన్నారు.
· కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాల వివాహం పట్ల అభిమానుల ఆసక్తి అద్వానీకి 10వ స్థానం సంపాదించిపెట్టింది.
· నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ క్లాస్ బ్రేక్‌అవుట్ స్టార్స్ అయేషా కంగా మరియు అంజలి శివరామన్ కూడా ఈ వారం జాబితాలో ఉన్నారు.
IMDb యొక్క ఈ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల ఫీచర్ ప్రతి సోమవారం అప్ డేట్ చేయబడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా IMDbకి ఉన్న 200 మిలియన్లకు పైగా నెలవారీ సందర్శకుల ద్వారా నిర్ణయించబడుతుంది. ఇండియాకు లొకేషన్ సెట్ చేసుకున్న కస్టమర్ల కోసం ఐఎండీబీ యాప్లో ఈ ఫీచర్ ప్రత్యేకంగా అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు భారతీయ సెలబ్రిటీలతో పాటు, ప్రసిద్ధ భారతీయ సినిమాలు మరియు టీవీ షోల ట్రైలర్లను కూడా చూడవచ్చు. IMDb ఫీచర్ వినియోగదారులు ఏమి చూడాలో తెలుసుకోవడానికి, వారి వాచ్ లిస్ట్ లో ఆడ్ చేసుకోవడానికి మరియు వారు చూసినదానికి రేటింగ్ ఇవ్వడానికి మరియు సమీక్షించడానికి కూడా ఉపయోగపడుతుంది. IMDb యాప్ Android పరికరాల కోసం Google Play స్టోర్ లో మరియు iPhone కోసం Apple App Store లో ఉచితంగా అందుబాటులో ఉంటుంది.
ఎంటర్టైన్మెంట్ అభిమానులు భారతీయ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టాలెంట్ మరియు ఫిల్మ్ మేకర్స్ తో కూడిన తాజా కంటెంట్ కోసం IMDb ఇన్స్టాగ్రామ్ మరియు ట్విట్టర్ పేజిని అనుసరించవచ్చు. ఫాలోవర్లు తమకు ఇష్టమైన భారతీయ సెలబ్రిటీలు మరియు టైటిల్స్ గురించి వారు ఎక్కువగా ఇష్టపడే వాటిని పంచుకోవచ్చు, తాజా ట్రైలర్లు మరియు ప్రత్యేకమైన IMDb కంటెంట్ అలాగే భారతదేశపు మరియు ప్రపంచవ్యాప్తంగా కొత్త కంటెంట్ గురించి తెలుసుకోవచ్చు.