Monday, December 23, 2024

బోయిన్‌పల్లిలో జిమ్‌ చేస్తూ కానిస్టేబుల్‌ మృతి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: జిమ్‌ చేస్తూ ఓ కానిస్టేబుల్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన మృతిచెందాడు. ఈ విషాద ఘటన నగరంలోని బోయిన్‌పల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విశాల్ అనే కానిస్టేబుల్‌ నగరంలోని ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నర్వహిస్తున్నాడు.

అయితే.. రోజూలానే శుక్రవారం ఉదయం కూడా విశాల్, బోయిన్‌పల్లిలోని ఓ జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేస్తుండగా.. గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో ఆయనను వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News