Monday, December 23, 2024

ప్రీతి ఆత్మహత్య ఘటనలో ట్విస్ట్.. మెడికో సైఫ్ కు మద్దతుగా పీజీ విద్యార్థుల నిరసన..

- Advertisement -
- Advertisement -

వరంగల్: ప్రీతి ఆత్మహత్య ఘటనలో మెడికో సైఫ్ కు పీజీ విద్యార్థులు మద్దతుగా నిలిచారు. తల్లిదండ్రుల ఒత్తిడితో తప్పుడు కేసులు పెట్టొద్దని డిమాండ్ చేస్తున్నారు. జూనియర్లకు సూచన చేసే క్రమంలో చేసిన పోస్టింగ్ ను వేధింపులుగా చేయొద్దని,  తప్పుడు కేసులు పెట్టొద్దని ప్లకార్డులతో మెడికోలు నిరసనకు దిగారు.

తన కూతురుపై సైఫ్ వేధింపులకు పాల్పడడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపిస్తూ ప్రీతి తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదు అరెస్ట్ చేశారు. సైఫ్ వేధింపులకు పాల్పడుతున్నారని గతంలో పై అధికారులకు ప్రీతి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై వీరిద్దరికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారని చెబుతున్నారు. ఇప్పుడు సైఫ్ ను అరెస్ట్ చేయడంతో వేధింపులు నిజమేనని భావిస్తున్నారు. ఈ కేసులో నిందితుడిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు ర్యాగింగ్ కేసు నమోదు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News