Saturday, November 23, 2024

ఏపి మాజీ మంత్రి నారాయణ కూతురి నివాసంపై సిఐడి దాడి!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇప్పుడు కొనసాగుతున్న ఓ కేసులో భాగంగా శుక్రవారం నేర పరిశోధన శాఖ(సిఐడి) అధికారులు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పి.నారాయణ కూతురి ఇంటిపై దాడులు జరిపారు. ఈ దాడులు చిత్తూరు జిల్లాలోని నారాయణ స్కూల్ లో పేపర్ లీక్‌కు సంబంధించినవని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కూడా నమోదయింది. నారాయణ విద్యా సంస్థలకు పి. నారాయణ వ్యవస్థాపకుడు, డైరెక్టర్. ఆయనపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇదివరలోనే ఏపి పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ మాల్‌ప్రాక్టీసెస్), ఐపిసి సెక్షన్ 408 (క్లర్క్ లేదా సేవకుడి ద్వారా నేనపూరిత విశ్వాస ఉల్లంఘన) సహా 10 వివిధ సెక్షన్ల కింద కేసులు బుక్‌చేశారు.

గత ఏడాది ఏప్రిల్‌లో పాఠశాలలో తెలుగు ప్రశ్న పత్రం లీక్ అయిందని, ఉపాధ్యాయుడు ప్రశ్న పత్రం ఫోటోను క్లిక్ చేసి సోషల్ మీడియాలో పంచుకున్నట్లు పోలీసులు గుర్తించిన గంట తర్వాత పరీక్ష ప్రారంభమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News