Sunday, November 24, 2024

టోకెన్ల కోసం రైతుల పడిగాపులు..

- Advertisement -
- Advertisement -

బాసర : పంట వేయడానికి, పంట కాపాడడానికి పంట అమ్ముకోవడానికి రైతుల కష్టాలు తప్పడం లేదు. ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతన్నకు ప్రభుత్వం పంట అమ్ముకోవడానికి రైతులు పడరాని కష్టాలు పడుతున్నారు. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో సొసైటి గోదాం వద్ద అర్ధరాత్రి నుంచి రైతులు టోకెన్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. రైతులువరుసలో తమ పట్టాపాస్ బుక్‌లను ఉంచి టోకెన్ల కోసం ఎదురుచూస్తున్నారు. రైతుల కోసం ఎన్నో సౌకర్యాల కల్పిస్తామన్న ప్రభుత్వం శనగ టోకెన్ల కోసం సుమారు పది గ్రామాల ప్రజల కోసం ఒకే చోట కౌంటర్లను ఏర్పాటు చేయడం ఏంటి అని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులను దృష్టిలో ఉంచుకొని శనగ కొనుగోలు కేంద్రాలను పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

రైతన్నలు పండిన పంటను అమ్ముకోవడానికి సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాసర మండల కేంద్రంలో గురువారం శనగల కొనుగోలు కేంద్రం ప్రారంబించారు. ఇందుకోసం అదికారులు జారీ చేసిన టోకెన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఉదయం పంపిణీ చేసే టోకెన్ల కోసం రాత్రిళ్లోను రైతులు క్యూ కట్టారు. చెప్పులు, పట్టాపాస్ బుక్‌లను క్యూలైన్‌లో పెట్టి టోకెన్ల జారీ కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నారు. రాత్రంతా నిద్ర లేకుండా టోకెన్ల కోసం కేంద్రం వద్దనే ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచితే ఈ సమస్యను కొంత వరకు తీరుతుందని రైతులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News