- Advertisement -
జగిత్యాలః జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులోని శ్రీ ఆంజనేయ స్వామి ప్రధాన ఆలయంలో చోరీ జరిగినట్లు స్థానికులు శుక్రవారం తెలిపారు. ఆలయం తాళాలు పగులగొట్టి లోనికి చొరబడ్డ దొంగలు స్వామి వారి మూల విరాట్టుకు ఉండే వెండి తొడుగు, మకర తోరణంతో పాటు స్వామి వారికి ఉపయోగించే అనిన వెండి వస్తువులు, సుమారు 6 నుంచి 8 కిలోల వెండి వస్తులు చోరీ చేసినట్లు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని డాగ స్కాడ్‌తో గాలింపు చర్యలు చేపట్టారు.
- Advertisement -