Monday, December 23, 2024

సిపిఆర్‌తో యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః గుండెపోటులో కుప్పకూలిన యువకుడికి సకాలంలో కానిస్టేబుల్ సిపిఆర్ చేయడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటన ఆరంఘర్ చౌరస్తా వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. ఎల్బి నగర్ ప్రాంతానికి చెందిన బాలరాజు బైక్‌పై ఆరాంఘర్ వైపు వస్తున్నాడు. చౌరస్తాకు రాగానే ఒక్కసారిగా కుప్పకూలాడు, అక్కడే ట్రాఫిక్ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ అతడికి వెంటనే సిపిఆర్ చేశాడు. అనంతరం ఉన్నతాధికారుల సూచనలతో వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించి, వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు.

బాలరాజుకు సకాలంలో సిపిఆర్ చేయడంతో పాటు ఆస్పత్రిలో చేర్పించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర కానిస్టేబుల్ రాజశేఖర్‌నుతన కార్యాలయానికి పిలిపించుకుని అభినందించి, రావార్డు అందజేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ డిసిపి హర్షవర్దన్, శంషాబాద్ ట్రాఫిక్ ఎసిపి శ్రీనివాసనాయుడు, రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్ శ్యాంసుందర్‌రెడ్డి ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News