Monday, December 23, 2024

పైలట్లు 900, క్యాబిన్ క్రూ 4,200

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కంపెనీ వృద్ధి ప్రణాళికలో భాగంగా ఈ ఏడాదిలో 900 మంది పైలట్లు, మరో 4,200 మంది ట్రైనీ క్యాబిన్ క్రూను నియమించుకోనున్నట్టు శుక్రవారం కంపెనీ ప్రకటించింది. టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా ఇటీవల ఎయిర్ బస్, బోయింగ్‌తో 470 విమానాల కోసం భారీ డీల్ కుదుర్చుకుంది. ఈ విమానాలను వచ్చే 7 నుంచి 10 ఏళ్లలో డెలివరీ చేయనున్నారు. ప్రస్తుతం ఎయిర్ ఇండియా వద్ద 115 విమానాలు ఉన్నాయి. ఈ ఏడాదిలో 31 విమానాల్లో ఆరు ఎయిర్‌బస్ ఎ350ఎస్, 25 బోయింగ్ 737 మాక్స్ విమానాలు రానున్నాయి. 737 మాక్స్ విమానాలు తక్కువ బడ్జెట్ ఎఐ ఎక్స్‌ప్రెస్‌లో చేరనున్నాయి. రెండు బోయింగ్ విమానాలతో పాటు లీజుపై 36 ప్లేన్లను ఎయిర్ ఇండియా చేర్చుకోనుంది. ఎయిర్‌లైన్‌లో ప్రస్తుతం 140 విమానాల సహాయక సిబ్బంది ఉన్నారు.

ఎయిర్ ఇండియా కొన్ని హోదాల వారికి సంవత్సరానికి రూ. 2 కోట్ల కంటే ఎక్కువ వేతన ప్యాకేజీలను కూడా ఆఫర్ చేస్తోంది. నివేదికల ప్రకారం, ఎయిర్ ఇండియా ’బి777 కెప్టెన్’ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీని కోసం ఎయిర్‌లైన్ వార్షిక వేతనం రూ. 2 కోట్లకు పైగా చెల్లించనుంది. ఎయిర్ ఇండియా ఒప్పందం తర్వాత భారత విమానయాన రంగంలో భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయి. ఫిబ్రవరి 14న టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ఎయిర్‌బస్, బోయింగ్ నుండి మొత్తం 470 విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. 470 విమానాలను నడపడానికి 6,500 మందికి పైగా పైలట్లను నియమించుకోవాల్సి ఉంటుందని విమానయాన పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఎయిర్ ఇండియాలో ప్రస్తుతం 1,600 మంది పైలట్లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News