Monday, January 20, 2025

27న రంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పన కేంద్రంలో జాబ్ మేళా

- Advertisement -
- Advertisement -

నాంపల్లి : ప్రైవేట్ సంస్థల్లో నిరుద్యోగులు, చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించే యత్నంలో భాగంగా ఈనెల 27న శాంతినగర్‌లో రంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పన కేంద్రంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి జాబ్ ఇంటర్వూలు మొదలవుతాయని, ఆసక్తి కల్గిన యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఉపాధి కల్పన కేంద్ర అధికారి జయశ్రీ కోరారు.

ఎయిర్ ఇండియా సాట్స్, ఎయిర్‌పోర్టు, సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, మిత్ర ఎజెన్సీస్ సంస్థల్లో హెల్పెర్లు, భారీ వాహనాల డ్రైవర్లు, సెల్స్ ఎగ్జిక్యూటివ్‌లు, విద్యార్హతలు పదో తరగతి ఉత్తీర్ణిత, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ. నెల జీతం 14 వేల నుంచి 18వరకు ఉంటుందని ఆమె వివరించారు. ఇతర వివరాలకు వెంటనే 9063099306 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News