Saturday, December 21, 2024

కుటుంబం పరువు పోయిందని…. కూతురిని చంపి… తల, మొండెం వేరు చేసి

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: కూతురుతో కుటుంబం పరువుపోయిందని కన్న తండ్రి ఆమెను చంపి… తల, మొండెం వేర్వేరు చోట్లలో పాతిపెట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. దేవంద్ర రెడ్డి తన ఇద్దరు కూతుళ్లు, భార్యతో కలిసి ఆలమూరు గ్రామంలో ఉంటున్నారు. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీరుతో ప్రసన(21)కు పెళ్లి చేశారు. ప్రసన్న తన భర్తతో కలిసి హైదరాబాద్‌లో ఉంటుంది. పెళ్లి కాక ముందే ప్రసన్న మరో వ్యక్తిని ప్రేమించింది. ప్రేమ విషయాన్ని దాచి బలవంతంగా ప్రసన్నకు ఆమె తల్లిదండ్రులు వివాహం చేశారు. హైదరాబాద్ నుంచి తన పుట్టింటికి వచ్చిన అత్తగారింటికి వెళ్లకపోవడంతో ఆమెతో తండ్రి గొడవకు దిగాడు.

ఫిబ్రవరి 10న ఆమె గొంతు నులిమి చంపేశాడు. మరో ఇద్దరుతో కలిసి మృతదేహాన్ని కారులో తీసుకొని నంద్యాల-గిద్దలూరు మార్గంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. మొండెం నుంచి తలను వేరుచేసి వేర్వేరు ప్రదేశాల్లో పాతిపెట్టాడు. అనంతరం ఏం తెలియనట్టు ఇంటికి వచ్చాడు. మనువరాలు ఫోన్ చేయకపోవడంతో తాత శివరెడ్డి తన దేవేంద్ర రెడ్డి ఇంటికి వచ్చి ప్రశ్నించాడు. తన కూతురిని చంపేశానని బదులివ్వడంతో వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దేవేంద్ర రెడ్డి అదుపులోకి తీసుకొని మృతదేహాన్ని పాతి పెట్టిన స్థలానికి తీసుకెళ్లారు. తల, మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం నంద్యాల ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News