Friday, January 3, 2025

యాత్రికుల బస్సులను ఢీకొట్టిన ట్రక్కు: 14 మంది మృతి

- Advertisement -
- Advertisement -

భోపాల్: ట్రక్కు అదుపుతప్పి ఆగి ఉన్న బస్సులను ఢీకొట్టడంతో 14 మంది యాత్రికులు దుర్మరణం చెందిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా-సత్నా సరిహద్దులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. యాత్రికులు కోల్ మహాకుంభ్ ఉత్సవాల్లో పాల్గొని సొంతూళ్లకు తిరిగి వస్తుండగా మూడు బస్సులను భోజనం చేసేందుకు బర్ఖదా గ్రామ సమీపంలో నిలిపారు. అదే సమయంలో సిమెంట్ ట్రక్కు టైరు పేలిపోవడంతో మూడు బస్సులను ఢీకొట్టింది. ఒక బస్సు ఒక వైపు పడిపోగా మరో బస్సు లోయలోకి దూసుకెళ్లి బోల్తపడింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం ఎయిర్ అంబులెన్స్‌లో భోపాల్ తరలిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయల నష్ట పరిహారం ఇస్తామని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News