న్యూస్‌డెస్క్: పెళ్లింట్లో విషాదం నెలకొంది. పెళ్లి మీటల మీద కూర్చోవడానికి కొద్ది నిమిషాల ముందు పెళ్లి తూతురు కల్యాణ మండపంలోనే కన్నుమూసింది. గుజరాత్ భావ్‌నగర్‌లోని సుభాష్‌నగర్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. నారి గ్రామానికి చెందిన రాణాబాయి కుమారుడు విశాల్‌కు జినాబాయ్ కూతురు హేతల్‌కు పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. భావనగర్‌లోని మహాదేవ్ దేవాలయంలో పెళ్లి తంతు నిర్వహిస్తుండగా పెళ్లి కుమార్తె కళ్లు తిరిగి స్పృహతప్పింది. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో ఆమె మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు. అయితే..పెళ్లి ఆగడం ఇష్టంలేని ఇరుపక్షాలకు చెందిన పెద్దలు మరణించిన పెళ్లికూతురి చెల్లెలిని అదే వరుడితో పెళ్లిపీటలపైన కూర్చోపెట్టాలని నిర్ణయించారు. వివాహం పూర్తయ్యేవరకు వధువు మృతదేహాన్ని కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచారు. ఆ తర్వాత మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.