Friday, November 22, 2024

తెలంగాణ రాష్ట్రం అన్ని కులవృత్తులకు సమాన న్యాయం

- Advertisement -
- Advertisement -

చేగుంట: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కుల వృత్తులకు సమాన న్యాయం చేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్‌పల్లి గ్రామ శివారులోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం ప్రక్కన ఉన్న ఈత వనాన్ని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలసి పరిశీలించారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని, కర్నాల్‌పల్లి గ్రామంలోని ఈత వనం మన రాష్ట్రానికే ఆదర్శం అని తెలిపారు. హరితహారంలో బాగంగా మన రాష్ట్రవ్యాప్తంగా 4 కోట్ల 26 లక్షల ఈత మొక్కలు పెంచుతున్నామని తెలిపారు.

ప్రతి సంవత్సరం మన ఎక్సైజ్ శాఖ అదికారులు మొక్కలు నాటుతున్నారని తెలిపారు. గతం లో ఏ ప్రభుత్వం చేయని చేయని పాలసీ మన తెలంగాణ ప్రభుత్వం నీరా పాలసీని తీసుక వచ్చిందని తెలిపారు. మన ప్రక్క రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం కులవృత్తులను అవమాన పరుస్తుందని తెలిపారు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అన్ని కులవృత్తులను అబివృద్ది చేస్తున్నామని తెలిపారు. ఈ కార్య క్రమంలో కర్నా ల్‌పల్లి రేణుకా దేవాలయ కమిటీ చైర్మన్ రాములు గౌడ్, జడ్‌పీటీసీ ముదాం శ్రీనివాస్, ఇబ్ర హింపూర్ సోసై టీ చైర్మన్ కొండల్‌రెడ్డి, చేగుంట సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్,గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ జాతీయ ప్రదాణ కార్యదర్శి కొండాపురం బాలరాజు గౌడ్,సెక్రటరీ జనరల్ రావుల సిద్దిరాములుగౌడ్,మెదక్ జిల్లా అద్యక్షులు ఆకుల మల్లేశంగౌడ్,రాష్ట్ర ప్రదాణ కార్యదర్శి సంగీతం నర్సాగౌడ్, కార్యదర్శి బి కిషన్‌గౌడ్, దౌల్తాబాద్ మండల పార్టి అద్యక్షులు రణం శ్రీనివాస్‌గౌడ్, చేగుంట వెంగళ్రావు, తానీష, మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ రేణుకాదేవాలయం వైస్ చైర్మన్ ప్రవీణ్‌గౌడ్, యాదా గౌడ్, ఎల్లాగౌడ్,వివిద గ్రా మాల సర్పంచులు, ఎంపీటీసీలు,పార్టి నాయకులు, గౌడ సంఘాల నాయకులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News